OBSERVER SHADOW NEWS
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 6:10 am Posted by : OBSERVER NEWS DESK

ఇల్లందులో శ్రీ చైతన్య ఐఐటి & నీట్ అకాడమీ ప్రారంభ

అత్యాధునిక బోధనతో ఐఐటి, నీట్ ప్రత్యేక శిక్షణ
—– చైతన్య ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ పత్తి శ్రీను.

అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్ :-

ఏజెన్సీ ప్రాంతమైన ఇల్లందులో గతంలో ఎన్నడు లేని విధంగా పట్టణంలో శ్రీ చైతన్య ఐఐటి & నీట్ అకాడమీ 2026-27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభించినట్లు అకాడమీ ప్రిన్సిపల్ పత్తి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు ఐఐటి, నీట్, ఈఏపీసెట్ వంటి పోటీ పరీక్షలకు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు బైపీసీ, ఎంపీసీ కోర్సులతో పాటు ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు ప్రాంతాల్లో అనుభవం కలిగిన అధ్యాపక బృందంతో బోధన సాగుతుందని తెలిపారు. హాస్టల్ సౌకర్యం, ప్రత్యేక స్టడీ మెటీరియల్, ప్రతి విద్యార్థిపై నిరంతర పర్యవేక్షణ, వారాంత పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. పేద, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌షిప్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించే లక్ష్యంతో అకాడమీని ప్రారంభిస్తున్నామని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.