OBSERVER SHADOW NEWS
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 6:37 pm Posted by : OBSERVER NEWS DESK

ఇల్లందు మండలం రేపల్లెవాడ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన దిండిగాల.

అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్ :-

మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ అజ్మీర బౌసింగ్ నాయక్ ఆహ్వానం మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు, బిఆర్ఎస్ ఫౌండర్ మెంబర్ మాజీ గ్రంథాలయాల సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ మండలంలోని రేపల్లెవాడ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను శనివారం ప్రత్యక్షంగా చూడటానికి బి ఆర్ ఎస్ పార్టీ బృందంతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు రాజేందర్ తో తమ గోడును వెల్లబోసుకున్నారు. సకాలంలో ధాన్యం సేకరించటం లేదని, ధాన్యాన్ని తెచ్చి రోజులతరబడి ఎదురుచూడాల్సి వస్తుందని,సరైన వసతులు లేక తార్బాలిన్ లు లేక ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తడిసిపోతున్నా పట్టించుకునే నాధుడు లేడని, తడిసిన ధాన్యాన్ని కొనటం లేదని, బస్తా, బస్తాకు తరుగు తీస్తున్నారని, గన్ని బ్యాగ్స్ సప్లై చేయటం లేదని, మార్కెట్ ధరకన్నాతక్కువ ధర చెల్లెస్తున్నారని తెలిపారు. మార్కెట్ లో దళారీలు రాజ్యం ఎలుతున్నారని రైతుల పొట్టగొట్టి లాభలు గడిస్తున్నారని మార్కెట్ కమిటీ అధికారులు దళారీలకే కొమ్ముగాస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాజేందర్గ మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ముఖమంత్రిగా ఉన్నప్పుడు ఈ బాధలు లేవని, గిట్టుబాటు ధర కల్పించటం తో పాటు ధాన్యం సకాలంలో కొన్నారని, తడిసిన రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనే వారాని కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రైతుల కష్టాలు పెరిగిపోయాయని, రైతుబంధు రాదు, విత్తనాలు దొరకవు, యూరియా దొరకదు ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటినా చేతలు గడప దాతటం లేదని విమర్శించారు. వెంటనే మార్కఫెడ్ జిల్లా మేనేజర్,పిఎసియస్ సిఈఓ లో మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని, ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని దళరీలను అరికట్టాలని లేకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షులు జబ్బర్, పట్టణ మాజీ ఉపాధ్యక్షులు అబ్దుల్ నబీ, ఇల్లందు మండల మాజీ వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ కుమార్, ఇల్లందు మండల మాజీ ఉపాధ్యక్షులు డేరింగుల పోషం, మాజీ కో ఆప్షన్ నెంబర్ ఘాజి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మూడు కృష్ణ ప్రసాద్ కామేపల్లి, సీనియర్ లాయర్ సువర్ణపాక సత్యనారాయణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నారపాక వసంతరావు, స్థానిక సర్పంచులు వేప శంకర్, ఎట్టి రమణ , ఉద్యమకారులు ఆదూరి రవి, రాంలాల్ పాసి, రాచపల్లి శ్రీను, సుందరి శ్రీను, వాసు, సునీల్,సీనియర్ నాయకులు మూలగుండ్ల ఉపేందర్ రావు, లలిత్ కుమార్ పాసి, శ్రీకాంత్, హరి ప్రసాద్ యాదవ్, సురేష్, కామేపల్లి ఉదయ్,గడ్డి శ్రీను, చిన్నారి, ముత్తయ్య, రాజుగారు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.