అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్:-
ఇల్లందు పూస పల్లి ప్రాజెక్టు ఓసి అంశంపై శుక్రవారం ఇల్లందుకు వచ్చిన ఆర్డిఓ మధు ను విజయలక్ష్మి నగర్, తిలక్ నగర్ సర్పంచులు రమేష్ బాబు స్రవంతిలతో పాటు అఖిలపక్ష నాయకులు కలిశారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ పూసపల్లి ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న నిర్వాసితులందరికీ మెరుగైన ప్యాకేజీ ఇచ్చి న్యాయం చేయాలని సర్పంచులు పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం ఈ ప్రాంతంలో 20% పరిశీలన చేస్తే పూస పల్లి ప్రాజెక్టు గుర్తించబడిందని మిగతా 80% ప్రాంతాన్ని సింగరేణి యాజమాన్యం దత్తత తీసుకొని రెండు పంచాయతీలను అభివృద్ధి చేయాలని ఆర్డిఓ మధును వారు కోరగా సానుకూలంగా స్పందించిన ఆర్డీవో అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు సర్పంచులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ధనుసరి రాజు, వడ్ల శ్రీను,సైదయ్య,భాస్కర్, చిన్నారి లాలు, క్లింట్ రోచ్ తదితరులు పాల్గొన్నారు.