OBSERVER SHADOW NEWS
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 6:05 am Posted by : OBSERVER NEWS DESK

జనగణన లో సరైన వివరాలు అందించండి. కౌన్సిలర్ కొర్లపాటి శివ కిరణ్.

అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్ :-

మే 11 నుండి ప్రారంభమైన జనగణనలో సరైన ఇంటి వివరాలను అందించాలని 22వ వార్డు కౌన్సిలర్ కోర్ల పార్టీ శివకిరణ్ తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ
జన గణన పై అవగాహన
జన గణన అనేది దేశ అభివృద్ధికి ఎంతో ముఖ్యమైన ప్రక్రియ అని, ప్రజల సంఖ్య, విద్య ఉపాధి నివాస పరిస్థితి వంటి వివరాలను సేకరించడం ద్వారా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయగలమన్నారు. మంగళవారం 22వ వార్డులో కౌన్సిలర్ కొర్లపాటి శివ కిరణ్ పాల్గొని జనగణన సర్వే మే 11 నుండి జూన్ 9 వరకు జరుగుతుందని, 22వ వార్డు ను జన గణనలో మూడు బ్లాకులుగా విభజించి, రోడ్డు మ్యాపులను ఏనుమేలేటర్, వార్డ్ ఆఫీసర్ లకు చూపించడం జరిగిందన్నారు. ప్రతి కుటుంబం సరైన సమాచారాన్ని అందించడం వలన ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేకూరుతాయని తెలియజేశారు. జనగణన సమయంలో ప్రజలు సహకరించాల్సిన విధానాన్ని ఇంటింటికి వచ్చే సిబ్బందికి సరైన సమాచారం ఇవ్వాలని అలాగే దేశ అభివృద్ధికి ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్యూ మాలేటర్ బొర్ర తులసమ్మ, వార్డ్ ఆఫీసర్ రజిని తదితరులు పాల్గొన్నారు.