మాజీ ఎంపీ ఉమ్మడి ఏపీ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు వడ్డె శోభనాద్రి శ్వరరావు.
అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్ :-
ప్రభుత్వ రంగాలను నిర్వీర్యపరిచి దేశాన్ని దోచుకునే కార్పొరేట్ శక్తుల పక్షాన కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నదని మాజీ ఎంపీ రైతు నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మాజీ మంత్రివర్యులు వడ్డె శోభనాద్రిశ్వరావు అన్నారు.
మంగళవారం అఖిలభారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ వ్యవస్థాపక సభలను ప్రారంభిస్తూ ఆయన ఇల్లందు పట్టణంలో రాయల చంద్రశేఖర్ ప్రాంగణంలో జరిగిన ( అయితా ఫంక్షన్ హాల్) మహాసభలలో ప్రతినిధుల ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మహాసభల ప్రారంభానికి ముందు చండ్ర కృష్ణమూర్తి ట్రస్ట్ భవన్ వద్ద ఏర్పాటుచేసిన జెండాను ఏఐయుకేఎస్ జాతీయ నాయకులు ప్రదీప్ సింగ్ ఠాగూర్ ఎగరవేశారు. ఓ అరుణ పతాకమా నీకివిగో రెడ్ సెల్యూట్ శ్రమజీవుల కేతనమా నీకివిగో రెడ్ సెల్యూట్ అంటూ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల సంతాప తీర్మానం బి.రాము ప్రవేశ పెట్టారు.అనంతరం ప్రారంభమైన ప్రతినిధుల సభకు అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ కన్వీనర్ కెచ్చల రంగారెడ్డి అధ్యక్షత వహించగా మాజీ ఎంపీ వడ్డె శోభనాద్రిశ్వరరావు మాట్లాడుతూ పారిశ్రామిక ఉత్పత్తులకు ధరలు నిర్ణయించినట్లుగానే వ్యవసాయ ఉత్పత్తులకు కూడా సమగ్ర ఉత్పత్తి ఖర్చుల ప్రాతిపదిక ప్రకారం ధరలు నిర్ణయించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో 2014 సంవత్సరం ముందు నాలుగు లక్షల మంది రైతులు వ్యవసాయంలో నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడినారని,ఆ తర్వాత లక్ష 30 వేలమంది బలవన్మరణాలకు పాల్పడినారని అయినా మోడీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని అన్నారు. మోడీ ప్రభుత్వం రైతుల మేలుకోరి చేసింది ఏమీ లేదని అన్నారు. ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం దేశంలోని కార్పొరేట్లకు 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందని, 80 వేల కోట్లు ఉద్దేశపూర్వకంగా బ్యాంకు లోన్లు ఎగొట్టిన గుత్త పెట్టుబడిదారుల పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనిల్,అంబానీ లాంటివాళ్ళు ఆకోవలోకే వస్తారని చెప్పారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలకై వ్యవసాయ రంగ రక్షణ కొరకు రైతులు దేశంలో పోరాడుతున్నారని చెప్పారు. వారిని అణచివేసే విధానాల్లో భాగంగానే విభజించు పాలించనే పద్ధతుల్లో మత విభజనకు మోడీ పాల్పడుతున్నారని అన్నారు. బిజెపి లాంటి పార్టీలు దేశ ప్రగతికి వ్యతిరేకమని,దేశ ప్రజాస్వామ్యానికి,రాజ్యాంగ హక్కులకు కూడా వ్యతిరేకమని చెప్పారు. ప్రజాపాలనకు బదులు మనుధర్మ సూత్రాల అమలును వారు ప్రాధాన్యతగా పెట్టుకున్నారని చెప్పారు. ఇప్పటివరకు బిజెపికి 2/3 మెజారిటీ రాలేదని 2029లో అధికారంలోకి వస్తే దేశంలోని ప్రజాస్వామ్యం సిగ్గుతో తల ఒంచుకోక తప్పదని అన్నారు.
మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు తుమ్మలపల్లి ప్రసాద్ మాట్లాడుతూ అఖిలభారత ఐక్య రైతు వ్యవస్థాపక మహాసభలు ఇల్లందులో జరగడం చారిత్రాత్మకంగా మహాసభల ప్రాధాన్యత ఉంటుందని ఈ మహాసభలకు హాజరైన దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన రైతు ప్రతినిధులు,రైతు సంఘం నాయకులు,ఉద్యమకారులు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు,మేధావులు, వ్యవసాయ రంగ నిపుణులు, రైతు సోదర సోదరీమణులకు విప్లవ స్వాగతం పలికారు.
ఇల్లందు నేల సాధారణ భౌగోళిక ప్రాంతం కాదని, దొరన్న,బాటన్న,ఎల్లన్న, కోటన్న, రాయల చంద్రశేఖర్ అన్నలతో పాటు వందల మంది విప్లవకారులు తమ అమరత్వంతో ఎరుపెక్కిన నేల ఇల్లందు అని అన్నారు. తమ పోరాట పంథాతో వేలాది ఎకరాల పోడు భూములను ఈ ప్రాంత పేద ప్రజలకు సాధించి పెట్టారని తెలిపారు. నల్లబంగారంగా పేరొందిన బొగ్గు గనులకు పుట్టినిల్లు ఇల్లందు అని బొగ్గు గని కార్మికులు సైతం తమ సమస్యల పరిష్కారం కోసం విరోచిత పోరాటాలు చేశారని తెలిపారు.ఇలా ఇల్లందు విప్లవ పోరాటాల చరిత్ర కలిగిన నేల ప్రజా చైతన్యంతో విప్లవ పోరాటాలు నిర్మించిన చరిత్ర ఇల్లందు ప్రజలదని,కార్మిక ఉద్యమాలు,రైతంగ పోరాటాలు,తునికాకు కార్మికుల సమ్మెలు,కష్టజీవుల హక్కుల కోసం సాగిన చరిత్రకు ఈ నేల సాక్ష్యం అని తెలిపారు.అన్యాయం,దోపిడీ అణిచివేతలకు ప్రజా పందా మార్గంలో ఎదురు నిలిచిన పోరాట స్ఫూర్తి ప్రాంతం మట్టిలో ఉన్నదని అన్నారు.అంతటి చైతన్యం కలిగిన ప్రజలు ఉన్నారు కాబట్టే ఒక విప్లవ పార్టీ అభ్యర్థి గుమ్మడి నరసయ్యను ఐదు సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపారని అన్నారు.ఇలాంటి చారిత్రాత్మక ప్రాంతం లో రైతాంగా ప్రత్యేకత మహాసభలు జరగడం ఎంతో గర్వకారణంగా ఉందని సందేశం ఇచ్చారు.
ప్రతినిధుల సభలో సౌహర్థ సందేశాలు బి కే యు హర్నీక్ సీంగ్ మహిమ్,కే కే యు నాయకులు శశికాంత్,సోదర సంఘాలైన జాతీయ నాయకులు ఉమాకాంత్, ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి పి,రామకృష్ణ, టి పి టి ఎఫ్ నాయకులు మనోహర్ రాజు, పి ఓ డబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి శిరోమణి, పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు అజ్మీర బిచ్చ, పి వై ఎల్ రాష్ట్ర కార్యదర్శి పి రామకృష్ణ సందేశం ఇచ్చారు. విదేశం లో ఉన్న వి.ప్రభాకర్ సందేశం పంపారు.