OBSERVER SHADOW NEWS
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 11:25 pm Posted by : OBSERVER NEWS DESK

నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్పార్టీ పట్టణ అధ్యక్షులు బోళ్ల సూర్యాన్ని సన్మానించిన ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ ఖాజా గౌస్ మోయినుద్దీన్.

అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్:-

ఇల్లందు నెంబర్ 2 బస్తీకి చెందిన ప్రముఖ పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోళ్ల సూర్యం ఇల్లెందు కాంగ్రెస్ పార్టీ పట్టణ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ మహమ్మద్ ఖాజా గౌస్ మొయినుద్దీన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఖాజా గౌస్ మోయినిద్దీన్ మాట్లాడుతూ సిపిఐ పట్టణ కార్యదర్శిగా సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిగా సుదీర్ఘ కాలం పాటు ఇల్లందు సిపిఐ పార్టీకి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షపాతిగా పనిచేసిన బోళ్ల సూర్యం 9 సంవత్సరాల పాటు ఇల్లందు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేశారు. అనేక సంవత్సరాల పాటు ప్రజాసేవకు అంకితమైన బోళ్ల సూర్యం 9 సంవత్సరాల పాటు ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య కు ప్రధాన అనుచరుడిగా ఎలాంటి పదవులు ఆశించకుండా పనిచేసిన బోళ్ల సూర్యం సేవలను గుర్తించిన రాష్ట్ర, జిల్లా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇల్లందు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడుగా నియమించినారని ఖాజా గౌస్ మొయినిద్దీన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తూ ముందుకు వెళ్తాడని ఆశిస్తున్నట్లు ఖాజా గౌస్ మొయినిద్దీన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బోళ్ల సూర్యం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్టణ నూతన అధ్యక్షుడుగా ఎంపిక చేసిన జిల్లా రాష్ట్ర అధిష్టానానికి ముఖ్యంగా ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్యకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ జూనియర్ నాయకులను కలుపుకొని పోయి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తానని పేద ప్రజల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని బోళ్ల సూర్యం పేర్కొన్నారు. ఘనంగా తనను సన్మానించిన మిత్రుడు ఖాజా గాస్ మొయినుద్దీన్ ఆయన మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు.ఈ సన్మాన కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇమామ్, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.