పాపికొండల విహారయాత్ర తాత్కాలిక నిలిపివేత
- అకాల వర్షాల నేపథ్యంలో అధికారుల నిర్ణయం - పర్యాటకుల భద్రత దృష్ట్యా యాత్ర రద్దు - వాతావరణం అనుకూలించిన తర్వాతే పునఃప్రారంభం రాజమహేంద్రవరం,తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు అధికారులు చేదువార్త తెలిపారు. గోదావరి నదిలో అత్యంత ఆదరణ పొందిన పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జలవనరుల శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విహారయాత్రలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం గోదావరి...