అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్ :-
కేంద్రంలో అధికార బిజెపి ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ పై పెంచినధరలను తగ్గించాలని ఆదివారం సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఇల్లందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సత్యనారాయణపురం లో నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఎన్నికల ముందు ఎలాంటి ధరలు పెంచమని హామీలిచ్చి ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం డిజిల్,పెట్రోల్ పై మూడు రూపాయలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై ఆర్థికంగా భారం మోపారని విమర్శించారు. పెంచిన డీజిల్,పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని లేనియెడల ఉద్యమ కార్యచరణ తీసుకొని ఆందోళన చేస్తామని హెచ్చరించారు.డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడం వలన సామాన్య రైతులు ప్రజలు కార్మికులు అన్ని రంగాల పై ఈ ఆర్థిక భారం పడి అన్ని నిత్యవసర వస్తువులపై ధరలు పెరుగుతాయని ఆయన తెలియజేశారు.తక్షణమే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ పట్టణ కార్యదర్శి ఎండి.రాసుద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కే. సారంగపాణి,న్యూ డెమోక్రసీ పట్టణ నాయకులు కొప్పుల శ్రీనివాస్,కొండపల్లి శ్రీనివాస్,ఆర్.నరసింహ రావు,జి.వెంకట నరసయ్య,మండల వీరయ్య,గూల్ల సదయ్య,టి.లాలు,ఎస్. వెంకటస్వామి. తదితరులు పాల్గొన్నారు.