OBSERVER SHADOW NEWS
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 9:53 am Posted by : OBSERVER NEWS DESK

రాష్ట్ర ప్రభుత్వం 51 వేల కోట్లను సింగరేణికి వెంటనే చెల్లించాలి.—

డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె సారయ్య.

బిఆర్ఎస్ బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం.

అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్:-

ఎఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యునియన్ బ్రాంచ్ కార్యవర్గ సబ్యుల సమావేశం స్థానిక విఠల్ రావు భవన్ లో ఆదివారం దాసరి రాజారామ్ అద్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వర్కర్స్ యునియన్ కేంద్ర కమిటీ డిప్యూటి ప్రధాన కార్యదర్శి కె సారయ్య పాల్గొని మాట్లాడుతూ ఈరోజు సింగరేణి ఆర్థికంగా ఇబ్బందులు పడటానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రాజకీయ జోక్యమేనని, రాష్ట్రానికి తలమానికంగా నిలిచిన శిరుల తల్లి సింగరేణి నేడు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. సింగరేణి యాజమాన్యం స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేని స్థితికి చేరుకుందని, చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కి, డైరెక్టర్లకు, చివరకు జనరల్ మేనేజర్లకు కూడా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేకపోవడం గమనార్హమని తెలిపారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో సింగరేణి తీవ్ర సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని వారు అన్నారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సింగరేణి కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కార్మికుల సంక్షేమం కోసం గుర్తింపు సంఘం ఏఐటియుసి యాజమాన్యంతో నిర్వహించిన స్ట్రక్చర్ సమావేశంలో అంగీకరించిన సమస్యలను ఇప్పటివరకు పరిష్కరించకపోవడంతో గుర్తింపు సంఘం పోరాటాలకు సిద్ధమవుతోందని, కార్మికులకు న్యాయపరంగా రావలసిన హక్కులను యాజమాన్యం ఆమోదించినప్పటికీ, రాజకీయ జోక్యం కారణంగా అవి సర్క్యులర్ రూపంలో విడుదల కాకపోవడం కార్మికుల్లో ఆగ్రహానికి దారితీస్తోందని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని భావించిన కార్మికులు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారని,అయితే ప్రస్తుత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాన్ని మించి రాజకీయ జోక్యం చేసుకోవడం వల్ల సింగరేణిలో కార్మిక సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని వారు ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ నేపథ్యంలో గుర్తింపు సంఘం ఏఐటియుసి సింగరేణి అన్ని ఏరియాలలో జరుగుతున్న పరిణామాలను కార్మికులకు వివరిస్తోందని. స్ట్రక్చర్ సమావేశంలో గుర్తింపు సంఘంతో కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబంధించిన డిమాండ్లను యాజమాన్యం వెంటనే సర్క్యులర్ రూపంలో విడుదల చేయకపోతే, అలాగే మెడికల్ బోర్డును తక్షణమే నిర్వహించకపోతే, అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని నిరవధిక సమ్మెకు దిగేందుకు గుర్తింపు సంఘం ఏఐటియుసి సిద్ధమవుతోందని వారు హెచ్చరించారు.

సింగరేణి కార్మికులు సింగరేణి భవిష్యత్తు కోసం, కొత్త గనుల ప్రారంభం కోసం, మెడికల్ బోర్డు పాత విధానాన్ని కొనసాగించడం కోసం, పెర్క్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ రద్దు కోసం, సొంత ఇంటి కల నెరవేర్చే సహకారం కోసం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం చేపట్టే సమ్మెలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా వారు కోరారు. ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్, బ్రాంచ్ ఉపాద్యక్షులు దాసరి రాజారామ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కొరిమి సుందర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సబ్యులు దేవరకొండ శంకర్, పట్టణ కార్యదర్శి మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ బాస శ్రీనివాస్, పిట్ కార్యదర్శులు నాదెండ్ల శ్రీనివాస్ రెడ్డి,జయరాజ్,దాట్ల వేంకటేశ్వర్లు, చాంద్ పాష, అజ్మీరా కీషొర్, తదితరులు పాల్గొన్నారు.