అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్:-
మండలంలోని విజయలక్ష్మి నగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ రమేష్ బాబు పాలకవర్గం నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని శుక్రవారం డిఎల్పిఓ సందర్శించారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చడం ముఖ్యమని నిరంతరం చలివేంద్రంలో మంచినీళ్లు పరిశుభ్రంగా ఉంచాలని ఇందుకు ఒక మనిషిని కేటాయించి పరిశుభ్రమైన నీటి ని దహర్తులకు అందించాలని ఆయన కోరారు. సర్పంచు రమేష్ బాబు మాట్లాడుతూ రోజు ఉదయం నుంచి నీటి సరఫరా చేస్తున్నామని ఎలాంటి ఇబ్బంది లేదని ఈ సందర్భంగా ఆర్డీవోకు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ చిరంజీవి,ఉప సర్పంచ్ రేణుక, సెక్రటరీ రజినీకాంత్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.