OBSERVER SHADOW NEWS
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 12:22 pm Posted by : OBSERVER NEWS DESK

సింగరేణి డిపెండెంట్ అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాల ఆర్డర్లు ఇవ్వాలని జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ధర్నా.

అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్ :-

సింగరేణి డిపెండెంట్ అభ్యర్థులకు ఉద్యోగాలను ఇవ్వాలని సింగరేణి

జీఎం కార్యాలయం ఎదుట బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి డిపెండెంట్ లు ధర్నా నిర్వహించారు. అనంతరం సింగరేణి జిఎం వీసం కృష్ణయ్యకు ఏఐటీయూసీ ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిపెండెంట్ ల ధర్నాను ఉద్దేశించి ఏఐటీయూసీ వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కే సారయ్య బ్రాంచ్ కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్ లో మాట్లాడుతూ

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో పనిచేస్తూ మరణించిన లేక వైద్య కారణాలతో ఉద్యోగ విరమణ చేసిన

సింగరేణి కార్మికుల ఆధారితులకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డిపెండెంట్ ఉద్యోగాలు వెంటనే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల త్యాగాలతోనే ఈ సంస్థ నిలిచిందని. అనారోగ్యంతో, ప్రమాదాల్లో మరణించిన కుటుంబాలకు ఉపాధి చూపడం యాజమాన్య బాధ్యత అని అన్నారు. కానీ సంవత్సర కాలంగా పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఫైళ్లను సాకులు చెప్పి ఇవ్వకుండా జాప్యం చేయడం మూలాన వందలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది అని వారు ఆవేదన వ్యక్తంచేశారు. సింగరేణి లొ మితిమీరిన రాజకీయ జోక్యం మూలాన కొంతమంది స్వార్థ పరశక్తులు చెప్పిన మాటలను వింటు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి వ్యాప్తంగా మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్ అభ్యర్థులకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని వారు డిమాండ్ చేసారు. డిపెండెంట్ ల సమస్యలను అర్థం చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి సమస్య పరిష్కరించకపోతె ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్, ఉపాద్యక్షులు దాసరి రాజారామ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పట్టణ కార్యదర్శి బాస శ్రీనివాస్, మండల కార్యదర్శి బొప్పిశెట్టి సత్యనారాయణ, ఎఐటియుసి జిల్లా సమితి సబ్యులు గుగులొత్ కృష్ణ, ఫీట్ కార్యదర్శులు దాట్ల వేంకటేశ్వర్లు, మాలోత్ హలిసింగ్,నూనె శ్రీనివాస్, బంటు యాదగిరి, బాష పాక రవి, ఉడుత ఐలయ్య, ఆఫ్రోజ్, హిమబిందు, షబ్బిర్, షెక్ వలి, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.