Sunday, June 21, 2026
Homeక్రైమ్ న్యూస్పోగొట్టుకున్న 127 మొబైళ్లను అప్పగించిన సిద్ధిపేట పోలీసులు

పోగొట్టుకున్న 127 మొబైళ్లను అప్పగించిన సిద్ధిపేట పోలీసులు

📰 Generate e-Paper Clip

  •  రూ.12 లక్షల విలువైన ఫోన్ల స్వాధీనం
  • సీఈఐఆర్‌లో వెంటనే ఫిర్యాదు చేయాలని సీపీ సూచన
  • ఈ ఏడాది జిల్లాలో ఇప్పటివరకు 344 ఫోన్ల రికవరీ

సిద్ధిపేట :  పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందించే కార్యక్రమంలో సిద్ధిపేట పోలీసులు మరోసారి విజయవంతమయ్యారు. జిల్లాలో పోయిన 127 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని బాధితులకు గురువారం అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ల విలువ సుమారు రూ.12 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఈ మొబైళ్లను గుర్తించి తిరిగి రికవరీ చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోయిన వెంటనే సీఈఐఆర్ వేదికలో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా ఫోన్లను త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. వ్యక్తిగత సమాచార భద్రత విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. మొబైల్ ఫోన్లలో వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారం ఉండే కారణంగా వెంటనే ఫిర్యాదు చేయడం ఎంతో అవసరమన్నారు.


ఈ ఏడాది జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 344 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలకు సేవలందించడంలో సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. బాధితులు తమ మొబైళ్లు తిరిగి పొందడంతో ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆస్తుల రక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!