Sunday, June 21, 2026
Homeతెలంగాణభద్రాద్రిఐక్య రైతు సంఘం జాతీయ మహాసభల కు ముస్తాబవుతున్న ఇల్లందు.

ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభల కు ముస్తాబవుతున్న ఇల్లందు.

📰 Generate e-Paper Clip

పట్టణ నలుమూలల జాతీయ మహాసభల వాల్ రైటింగ్ షురూ….

అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్:-

పట్టణంలోని చండ్ర కృష్ణమూర్తి విజ్ఞాన భవనంలో, అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) ప్రధమ జాతీయ మహాసభలకు ఇల్లందు ముస్తాబైంది. ఇప్పటికే పట్టణంలోని నాలుగు మూలలో వాల్ రైటింగ్ షూ అయింది. కరెంట్ ఆఫీస్ సెంటర్ నుండి, మహబూబాబాద్ బైపాస్ రోడ్డు వరకు, 24, చెరువుకట్టదారిలో,కోర్టు సెంటర్లో వాల్ రైటింగ్ చేయడం జరిగిందని,

సి పి ఐఎంఎల్ ప్రజాప్రందా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చండ్ర అరుణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటికే ఇల్లందు డివిజన్లో టేకులపల్లి, గుండాల, ఇల్లందు మండలంలో గ్రూప్ మీటింగులు ద్వారా ప్రచారం జరుగుతుందన్నారు. ప్రదర్శనకు 600 మంది కళాకారులతో ఆటపాట ఉంటుందని దీనికోసం అరుణోదయ కోలాటం

రిహాసల్స్ జరుగుతున్నాయనీ తెలిపారు.

ఇల్లందు పట్టణంలో జరుగుతున్న అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభలు ఈనెల 11వ తారీఖు నాడు ఫారెస్టు గ్రౌండ్ నుండి జెకె సింగరేణి స్కూల్ గ్రౌండ్ వరకు, భారీ ప్రదర్శన బహిరంగ సభ ఉంటుందని ఇల్లందు పట్టణంలో జరిగే ఈ ప్రదర్శన బహిరంగ సభను విజయవంతం చేయాలని రైతులకు, రైతు కూలీలకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూకేఎస్ జిల్లా అధ్యక్షులు బుర్ర వెంకన్న, పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి బోస్, టేకులగూడెం సర్పంచ్ సందీప్ భాస్కర్, అరుణోదయ జిల్లా అధ్యక్షులు బుర్ర రాఘవులు, టియుసిఐ ఇల్లందు ఏరియా కార్యదర్శి మల్లెల వెంకటేశ్వర్లు, పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు కంపాటి పృద్వి తదితరులు పాల్గొన్నారు .

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!