Sunday, June 21, 2026
Homeతెలంగాణఏఐటియుసి గుర్తింపు సంఘం నాయకులతో సింగరేణి యాజమాన్యం భేటీ.

ఏఐటియుసి గుర్తింపు సంఘం నాయకులతో సింగరేణి యాజమాన్యం భేటీ.

📰 Generate e-Paper Clip

అబ్జర్వర్ షాడో ఇల్లెందు న్యూస్:-

హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో గుర్తింపు సంఘం అయిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ ) నాయకులతో డైరెక్టర్ (పర్సనల్) గౌతమ్ పొట్రు , ఐఏఎస్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమావేశంలో కార్మికుల సమస్యల పరిష్కారంపై యాజమాన్యం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని,
సమావేశంలో గుర్తింపు సంఘం ప్రధాన నాయకులు కార్మికులకు సంబంధించిన అనేక పెండింగ్ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా, యాజమాన్యం సానుకూలంగా స్పందించి ఈ క్రింది హామీలు ఇచ్చిందన్నారు.
మెడికల్ బోర్డును ఒక నెలలోపు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
సొంత ఇంటి పథకంపై వచ్చే స్ట్రక్చర్ మీటింగ్‌లో చర్చించి అమలు విధానాలు ఖరారు చేస్తామని తెలిపారు.
పెర్క్స్ పై ట్యాక్స్ సమస్యను వచ్చే స్ట్రక్చర్ మీటింగ్‌లో చర్చించి అమలు చేస్తామని పేర్కొన్నారు.
కార్మికులు క్వార్టర్లు ఖాళీ చేసిన వెంటనే క్వార్టర్ వెకేషన్ సర్టిఫికేట్ జారీ చేస్తామని తెలిపారు.
పెండింగ్‌లో ఉన్న 337 మందికి పైగా డిపెండెంట్‌లకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు.
గనులపై డిపెండెంట్ ఉద్యోగాల దరఖాస్తులను కేసు వారీగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అనారోగ్యంతో ఆసుపత్రులకు వెళ్లిన కార్మికుల వైద్య బిల్లులను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
మూడు సంవత్సరాల నిబంధనకు సంబంధం లేకుండా ఖాళీలు ఉన్నచోట వెంటనే ట్రాన్స్‌ఫర్లు చేస్తామని తెలిపారన్నారు.
మారుపేర్ల సమస్య ప్రభుత్వ స్థాయిలో చర్చించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అండర్‌గ్రౌండ్ అలవెన్స్ కట్టింగ్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
డిస్మిస్ అయిన ఇతర కార్మికుల సమస్య పరిష్కరిస్తామని తెలిపారన్నారు.
ఆసుపత్రుల్లో ఆధార్ వివరాలు మారిన వారికి సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా చికిత్స అందిస్తామని పేర్కొన్నారు.
ఓవర్‌మన్‌లకు పెండింగ్ ప్రమోషన్లు మంజూరు చేస్తామని తెలిపారు.
అన్‌ఫిట్ అయిన మైనింగ్ మరియు ట్రేడ్స్‌మెన్ కార్మికులకు తగిన సూటబుల్ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
రిటైర్డ్ కార్మికులకు నిలిపివేసిన లాభాల వాటా, దీపావళి బోనస్ పి ఎల్ ఆర్ చెల్లించేందుకు అంగీకరించారని
గోల్డెన్ హ్యాండ్‌షేక్ లేదా విఆర్ ఎస్ లాంటివి అమలు చేయబోమని డైరెక్టర్ స్పష్టం చేశారని,
కాంట్రాక్టు కార్మికులు జనరల్ సమ్మెలో పాల్గొన్న వాళ్లకి పీనల్ వెజ్ కట్టింగ్ నిలిపివేస్తామన్నారని తెలిపారు.
అదనంగా, మిగిలిన కీలక సమస్యలను త్వరలో సీఎండీ మరియు డైరెక్టర్ (పర్సనల్) స్థాయిలో జరిగే స్ట్రక్చర్ మీటింగ్‌లో చర్చించి పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.
కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని నాయకులు తెలిపారు.ఈ చర్చల్లో ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, అద్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, అడిషనల్ ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె సారయ్య మరియు అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!