Saturday, June 20, 2026
Homeతెలంగాణకౌన్సిలర్ దండు సారయ్య ఆధారం లేని ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి.---- డానియల్, బడుగు...

కౌన్సిలర్ దండు సారయ్య ఆధారం లేని ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి.—- డానియల్, బడుగు సాంబమూర్తి, జాఫర్.

📰 Generate e-Paper Clip

అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్:-

కౌన్సిలర్ దండు సారయ్య ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తదని ఇల్లందు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు డానియల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి, కౌన్సిలర్ జాఫర్, కో ఆప్షన్ మెంబర్ మడుగు సాంబమూర్తి తీవ్రంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా కోఆప్షన్ సభ్యులు మడుగు సాంబ మూర్తి డానియల్ జాఫర్లతో కలిసి మాట్లాడుతూ
కౌన్సిలర్ దండుసారయ్య కక్షగట్టి తన కుటుంబాన్ని ఆబాసుపాలు చేయడం సరికాదని అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇల్లందు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు డానియల్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి జాఫర్ ర్లతో కలసి సాంబమూర్తి మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల మీద గాని కార్యకర్తల మీద గాని ఇందిరమ్మ కమిటీ సభ్యుల మీద గాని ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. తనకు తెలియకుండా తన బంధువులు వార్డులో పంపు కనెక్షన్లు పెట్టారని, తనకు తెలియకుండా నీటి టాంకర్ లు సరఫరా చేస్తున్నారని, కౌన్సిలర్ ప్రమేయం లేకుండా ఇండ్ల పట్టాలను ఇస్తున్నారని ఆరోపణలు చేస్తున్న దండు సారయ్య ముందుగా నియమ నిబంధనలు తెలుసుకోవాలన్నారు. పంపు కలెక్షన్లు పెట్టారని ఆరోపిస్తున్న దండు సారయ్య ఎవరికి పెట్టారు ఎప్పుడు పెట్టారు ఆధారాలతో సహా మున్సిపల్ కమిషనర్ కి మున్సిపల్ చైర్ పర్సన్ కి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు పై కమిషనర్ చైర్ పర్సన్ విచారించి సదరు ఉద్యోగిని ఉద్యోగం నుండి తీసేస్తారని ఆయన తెలిపారు. ఫిల్టర్ బెడ్ దగ్గర ఉన్న ఇంచార్జ్ ఫయీఇస్ అధికారుల ఆదేశం ప్రకారం పంపులు ఇస్తారు తప్ప ఎవరు పడితే వారు అడ్డగోలుగా పంపు కనెక్షన్ ఇవ్వరనే విషయాన్ని తెలుసుకోవాలని మడుగు తెలిపారు. నీటి ట్యాంకర్ తనకు తెలియకుండా 13 వ వార్డులో మడుగు బంధువులు సరఫరా చేస్తున్నారని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వాటిలోని ప్రజలు నీటి ట్యాంకర్ కావాలని మున్సిపల్ అధికారులను సంప్రదించి 1000/- రూపాయలు కడితే వార్డులోని ఎవరికైనా నీటి ట్యాంకర్లను ఇస్తారనే విషయం తెలుసుకోవాలన్నారు. ఈ విషయాన్ని సైతం తన కుటుంబం వార్డు కౌన్సిలర్కు తెలియకుండా నీటి సరఫరా చేస్తున్నారని ఆరోపణలు చేయడం కావాలని తన కుటుంబాన్ని బదనాం చేయడమే నని అన్నారు. కౌన్సిలర్ గా తన ప్రమేయం లేకుండా ఇందిరమ్మ పట్టాలను ఎలాంటి హక్కు లేని మడుగు వెంకటలక్ష్మిఇస్తున్నారని ఆరోపణలు చేయడం నిబంధన తెలియకుండా మాట్లాడడమేనని తెలిపారు. మడుగు వెంకటలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలో సభ్యురాలని, వార్డు కౌన్సిలర్ లేని పక్షంలో ఇందిరమ్మ పట్టాలను ఇవ్వొచ్చని ఆయన తెలిపారు. దీన్ని సైతం భూతద్దంలో పెట్టి విమర్శించడం సరికాదన్నారు. దండు సారయ్యను మానసికంగా వేధిస్తున్నారని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేయడంపై బడుగు సాంబమూర్తి మాట్లాడుతూ ఎప్పుడైనా దండు సారయ్యను గాని ఆయన అనుచరులపై గాని దాడి చేశామా ఎప్పుడైనా అడ్డుకొని నిల దీశామ అని ఆయన ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కావాలని తనను తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న దండు సారయ్య విధానాలు మార్చుకోవాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు తెలిపారు. ప్రజాసేవ చేస్తున్నా అని పేర్కొంటున్న దండు సారయ్య తన దగ్గరికి ప్రజలు వచ్చే విధంగా చూసుకోవాలని అలా కాకుండా ప్రత్యర్థులపై అబాండాలు వేయడం సరికాదన్నారు. నీవు ఎక్కడి నుంచి వచ్చావో ఏమి చేస్తున్నావో పట్టణ ప్రజలకు వ్యాపారస్తులకు అందరికీ తెలుసు అని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేని దండు సారయ్య కావాలని విష ప్రచారం చేయడం ఇంతటితో మానుకోవాలని వారు కోరారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం ఇండ్ల పట్టాలను పంపిణీ చేసిన విషయం తెలుసుకోవాలన్నారు. తన వార్డులో ప్రోటోకాల్ పాటించడం లేదన్న కౌన్సిలర్ దండుసారయ్య మున్సిపల్ కమిషనర్ కు చైర్పర్సన్ కు ఫిర్యాదు చేసి ప్రోటోకాల్ పాటించని వారిపై చర్య తీసుకునే విధంగా కృషి చేయాలె తప్ప 13వ లో నివాసం ఉంటున్న తనపై తన కుటుంబం పై ఆరోపణలు చేస్తే ఊరికినే ప్రసక్తే ఉండదని వారు తెలిపారు. ఆయన ఆరోపించిన ప్రతి విషయం అభూత కల్పన గ వారి కొట్టి పారేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఇల్లందు మునిసిపల్ వైస్ ఛైర్మెన్ పెండేల రాజు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ జాఫర్, కౌన్సిలర్లు కొర్లపాటి శివ కిరణ్, అజ్మీర వంశీ, కమల్ కోరి, నీలపు రమేష్, మెరుగు కార్తీక్, గోపగాని రాజు, నీరుడు ఉపేంద్ర, రంప రమ్మ, కుష్బూ హరి హర క్షేత్రం ఆలయ మాజీ చైర్మన్ గంధ సదానందం, మొగిలి ఈశ్వర్, రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!