Saturday, June 20, 2026
Homeతెలంగాణపెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. ---- బి ఆర్ ఎస్ నాయకులు సువర్ణపాక...

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. —- బి ఆర్ ఎస్ నాయకులు సువర్ణపాక సత్యనారాయణ.

📰 Generate e-Paper Clip

అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్ :-

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలనీ బిఆర్ఎస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గ నాయకులు సుర్ణపాక సత్యనారాయణ డిమాండ్ చేశారు. మండల కేంద్రం ఇల్లందులో శనివారం విలేకరుల తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్. డిజిల్ పై 3 రూపాయలు పెంచడాన్ని బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూన్నామన్నారు. డీజిల్, పెట్రోల్ దరల పెరుగుదల వల్ల నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతాయని దీని వల్ల సామాన్య ప్రజలు పై అధిక భారం పడుతుందన్నారు. కేంద్రంలో ని బిజెపి ప్రభుత్వం వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!