Saturday, June 20, 2026
Homeతెలంగాణమైనర్ బాలికపై లైంగిక దాడి విషయంలో బండి భగీరధ్ ను వెంటనే అరెస్టు చేయాలి.

మైనర్ బాలికపై లైంగిక దాడి విషయంలో బండి భగీరధ్ ను వెంటనే అరెస్టు చేయాలి.

📰 Generate e-Paper Clip

చండ్ర అరుణ,
షేక్ యాకుబ్ షావలి,
పాయం వెంకటేశ్వర్లు.

అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్:-

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం మున్సిపల్,సింగరేణి,హమాలి కార్మికుల సమావేశం పార్టీ పట్టణ కార్యదర్శి పాయం వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో, ప్రజా పందా మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు చండ్ర అరుణ, టి యు సి ఐ జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి, పాల్గొని మాట్లాడుతూ, బండి సాయి భగీరథనీ తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్ 17ఏళ్ల మైనర్ బాలికతో మద్యం తాగించి హత్యాచారం చేసిన విషయంపై ఇంకా పోలీసులు స్పందించడం లేదన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడిపై నమోదైన పొక్సో కేసు వ్యవహారంలో పోలీసులు విచారణ జరిపి అరెస్ట్ చేయాలని, గతంలో ప్రచార మాధ్యమాలలో తోటి విద్యార్థులపై దాడులు చేసినట్టు స్పష్టంగా ఆధారాలు ఉన్నాయని,వీటిని కూడా పరిగణలోకి తీసుకొని పొక్సో తో పాటు రౌడీ షీట్ ను ఓపెన్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సాధారణంగా మైనర్‌ బాలికపై ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు అందిన వెంటనే ఆరోపణలు ఎదుర్కొనే వ్యకిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, సదరు వ్యక్తిని పిలిపించి విచారిస్తారనీ, బాధితురాలి నుంచి ఫిర్యాదు అందిన తర్వాత వారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకొని, ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అవసరమైతే సెక్షన్లను మార్చి బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని విచారించి తదుపరి చర్యలు తీసుకుంటారని అన్నారు. బండి భగీరథ్‌ కేసు వ్యవహారంలో చూపిస్తున్న ఉదాసీనత సామాన్యులపై మాత్రం కనిపించదని తెలిపారు. లైంగిక దాడి కేసు లేదా పొక్సో కేసు నమోదైనప్పుడు వెంటనే ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తిని విచారణ పేరుతో స్టేషన్ లో ఉంచుతారు కానీ తాజా కేసులో మాత్రం పోలీసులు బాధిత కుటుంబానికే సినిమా చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, లైంగిక వేధింపులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదై 8 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కనీసం విచారించే సాహసం పోలీసులు చేయలేదని అన్నారు. అధికారంలో ఉన్నోడు తప్పు చేస్తే పోలీసులు వ్యవహరించే తీరు విస్మయానికి గురించేస్తుందని అన్నారు. వెంటనే బండి భగీరధ్ ను అరెస్ట్ చేసి శిక్షించాలని, బాధ్యత గల కేంద్రమంత్రి బండి సంజయ్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొడుకును తప్పు నుండి కాపాడుకోవాలనే ప్రయత్నంలో బాలిక తల్లి, దండ్రులను భయబ్రాంతులకు గురించేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి సీతారాములు, నాయిని కృష్ణ కుమార్ భారతి వార శ్యామ్, బి వెంకటేశ్వర్లు ఉమా సంధ్య, జి రాజేశ్వరి జమున గంగా దుర్గా బాబురావు తరుణ్ లింగమూర్తి ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!