అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్:-
ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 19వ వార్డులో నిర్మాణంలో ఉన్న మల్టీ యుటిలిటీ సెంటర్( ఫంక్షన్ హాల్) పనులు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ను గత కొద్ది సంవత్సరాలుగా మధ్యలో నిలిచిపోయిన విషయం తన దృష్టికి రావడంతో శనివారం ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య సంబంధిత స్థలాన్ని సందర్శించి పెండింగ్లో ఉన్న పనులను వెంటనే ప్రారంభించాలని మునిసిపల్ అధికారులను కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇల్లందు మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్మిత్ర డానియల్ మల్టీ యుటిలిటీ సెంటర్ను పరిశీలించి సంబంధిత మున్సిపల్ అధికారులతో కాంట్రాక్టర్ వీరన్నతో సమావేశమై పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణమిత్ర డానియల్ మాట్లాడుతూ ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్యతో మాట్లాడి సదరు భవన నిర్మాణ పనుల కోసం 64 లక్షల నిధులు మంజూరు చేయించామని ఆమె తెలిపారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిర్మాణ పనులను వేగవంతంగా ప్రారంభించి పూర్తి చేయాలని ఆమె అధికారులకు కాంట్రాక్టర్కు స్పష్టం చేశారు. ఫంక్షన్ హాల్ చుట్టుపక్కల కొంత ఆక్రమణకు గురి కావడంతో ఆ ఆ ఆక్రమణలను వెంటనే తొలగించి పనులను నిరాటంకంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండి జాఫర్,మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు పర్రి స్వర్ణలత శ్రీనివాస్,స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ గుండంపల్లి సతీష్ నాయుడు, కాంట్రాక్టర్ వీరన్న తదితరులు పాల్గొన్నారు.
