అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్:-
ఇల్లందు ప
ట్టణంలోని 4వ వార్డు కౌన్సిలర్ ఎండి కుష్బూ ఆధ్వర్యంలో,
6వ వార్డు కౌన్సిలర్ రాధా కమల్ కోరి ఆధ్వర్యంలో
10వ వార్డు కౌన్సిలర్ మెరుగు కార్తిక యాదవ్ ఆధ్వర్యంలో
ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇండ్ల సంపూర్ణ అసంపూర్ణ నిర్మాణ తీరుతెన్నులను పరిశీలించేందుకు శనివారం మూడో రోజు ఇల్లందు మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్ ప్రత్యేక పర్యటన చేసారు.
పరిశీలన కార్యక్రమం కొనసాగింపు భాగంలో
మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న, అసంపూర్తిగా నిలిచిపోయిన, వివిధ కారణాలతో పనులు ప్రారంభం కానీ పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ గృహాలపై ప్రత్యేక పరిశీలన కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే స్థానిక 1వ, 2వ,3వ వార్డుల్లో పరిశీలనలు నిర్వహించిన మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్ శనివారం 4వ, 6వ 10వ వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముగ్గురు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మూడు వార్డుల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి గృహ నిర్మాణ పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు.
4వ వార్డు కౌన్సిలర్ ఎండి కుష్బూ , 6వ వార్డు కౌన్సిలర్ రాధా కమల్ కోరి, 10వ వార్డు కౌన్సిలర్ మెరుగు కార్తిక యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశీలనల్లో నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన ఇళ్లు, ఇంకా ప్రారంభం కాని గృహాలు, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారుల వివరాలను సేకరించారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వ స్థాయిలో తగిన పరిష్కార చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.
మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ఇదే విధంగా దశల వారీగా ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక 20వ వార్డు కౌన్సిలర్ ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎండి జాఫర్ , మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు మడుగు సాంబమూర్తి, ఎండి ఆజాం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎండి మున్నాభాయ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎం.డి అత్తర్, కాంగ్రెస్ నాయకులు ఎండి ఖలీమ్, ఎల్ రాజేష్, పదముత్తం సంతోష్ (చంటి) కమల్ కుమార్ కోరి, ఎనగంటి చిన్న శీను, సిహెచ్ శంకర్, కొప్పుల సమ్మయ్య, సందీప్, శివ, సాయి గోపి కోరి, సంపత్ చారి, మాచర్ల వేణు, అప్పనపల్లి సతీష్, వలకాల శ్రీను, వడ్లకొండ శ్రావణ్, వార్డు ఆఫీసర్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
