Sunday, June 21, 2026
Homeతెలంగాణ11న జరిగే రైతు ప్రదర్శన బహిరంగ సభకు విస్తృతంగా ప్రచారం.-----

11న జరిగే రైతు ప్రదర్శన బహిరంగ సభకు విస్తృతంగా ప్రచారం.—–

📰 Generate e-Paper Clip

షేక్ యాకుబ్ షావలి
పాయం వెంకన్న.

అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్ :-

ఇల్లందు పట్టణంలో జరిగే రైతు జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని, శనివారం మున్సిపల్, సింగరేణి హమాలి రైస్ మిల్ కార్మికుల వద్ద ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో టియుసిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి, ఇల్లందు ఏరియా అధ్యక్షులు పాయం వెంకన్న పాల్గొని మాట్లాడుతూ అఖిలభారత ఐక్య రైతు సంఘం(ఏఐయుకే ఎస్) జాతీయ ప్రథమ మహ సభలు ఇల్లందులో జరుగుతున్నాయని ఈ సభలను విజయవంతం చేసే బాధ్యత ఇల్లందు కార్మిక వర్గానికి ఉన్నదన్నారు. మోడీ ఈ దేశానికి మూడవసారి ప్రధాని అయిన తర్వాత రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవడానికి బదులుగా మోడీ ప్రభుత్వం మరిన్ని చర్యల ద్వారా తన దాడులను తీవ్రతరం చేస్తున్నాడన్నారు. హక్కుగా ఉన్న ఉపాధి హామీ ని తీసివేసి, బడ్జెట్ నియంత్రణలో ఉండే కేంద్ర పర్యవేక్షక పథకంగా మార్చారని, కొత్త మార్కెటింగ్ విధానం విత్తన బిల్లు,విద్యుత్ బిల్లు, మన అన్నదాతలపై పూర్తిస్థాయి దాడికి సాధనాలుగా మారాయని వారన్నారు.ఈ మహాసభలు పోరాటాల పురిటి గడ్డ ఇల్లందులోనే జరుపుకోవడం ఒక ప్రత్యేతను సంతరించుకుందన్నారు. ఈ మహాసభలో ఈ దేశ ప్రధానీ మోడీ రైతు వ్యతిరేక విధానాలపై చర్చించి దేశవ్యాప్త ఆందోళన చేసేందుకు ఇల్లేందు వేదిక కాబోతుందని వారు ఈ సందర్భంగా అన్నారు.
ఈనెల 11న సోమవారం ఫారెస్ట్ గ్రౌండ్ నుండి భారీ ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని వారు కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశాలలో, కునూరి వీరన్న హమాలీ యూనియన్ కార్యదర్శి శ్యామ్, మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు నాయిని కృష్ణ, రైస్ మిల్ అధ్యక్షులు చందర్,వాటర్ సప్లై యూనియన్ అధ్యక్షులు దుర్గా మహేష్, ఫయాజ్, రాజేష్,బొల్లి రవి, మోటం సంపత్,రామచంద్రు, భారతి, కుమార్, ఉమా వెంకన్న, సదా, నందు, సంధ్య, రమణ, దుర్గ, నాంచారి, శేఖర్, వీరస్వామి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!