Sunday, June 21, 2026
Homeతెలంగాణబిజెపి జిల్లా ఉపాధ్యక్షుడిగా బాలగాని గోపికృష్ణ నియామకం.

బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడిగా బాలగాని గోపికృష్ణ నియామకం.

📰 Generate e-Paper Clip

అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్ :-
ఇల్లందు నెంబర్ 2 బస్తికి చెందిన బాలగాని గోపికృష్ణ అనేక సంవత్సరాలుగా ఇల్లందు నియోజకవర్గ,పట్టణ కేంద్రంలో బిజెపి క్రియాశీలక కార్యకర్తగ ఇల్లందు నియోజకవర్గ కన్వీనర్ గా పార్టీ బలోపేతానికి అనేక విధాలుగా సేవలందించిన బాలగాని గోపికృష్ణ సేవలను గుర్తించిన బిజెపి జిల్లా,రాష్ట్ర నాయకత్వం శనివారం బాలగాని గోపి కృష్ణను
బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి నియమించి నియామక ఉత్తర్వులను విడుదల చేశారు. గతంలో బిజెపి పార్టీ నిర్ణయం మేరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో తన వంతు పాత్ర పోషించానని, రానున్న ఎన్నికల్లో బిజెపి గెలుపే లక్ష్యంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని బాలగాని గోపికృష్ణ గౌడ్ తెలిపారు. తనను జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ కు జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి, సహకరించిన పార్టీ పెద్దలందరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా బాలగాని గోపికృష్ణ ఎంపిక కావడం పట్ల పలువురు పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!